Wednesday, 28 November 2012

Kedareswara Vratham

కేదారేశ్వర వ్రత విశిష్ఠత

మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు.

వ్రతవిధానము


భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు మీరు కోరిన వరంబియ్యగలడు.

No comments:

Post a Comment